29, మార్చి 2025, శనివారం
తపస్సు కాలపు నాలుగోవ ఆదివారం
22, మార్చి 2025, శనివారం
తపస్సు కాలపు మూడవ ఆదివారము
తపస్సు కాలపు మూడవ ఆదివారము
15, మార్చి 2025, శనివారం
తపస్సుకాలపు రెండొవ ఆదివారము
8, మార్చి 2025, శనివారం
తపస్సుకాలపు మొదటి ఆదివారము
1, మార్చి 2025, శనివారం
సామాన్యకాలపు ఎనిమిదవ ఆదివారము
22, ఫిబ్రవరి 2025, శనివారం
సామాన్యకాలపు ఏడవ ఆదివారము
19, ఫిబ్రవరి 2025, బుధవారం
మార్కు 9:41-50
February 27
సిరా 5:1-8
మార్కు 9:41-50
మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి, ఎవ్వడు మీకు నా పేరిట చెంబెడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో నిశ్చయముగచెప్పుచున్నాను" అనెను. "నన్ను విశ్వసించు ఈ చిన్న వారిలో ఏ ఒక్కడైన పాపి అగుటకు కారకుడగుటకంటె, అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. నీ చేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. రెండు చేతులతో నిత్య నరకాగ్నిలోనికి పోవుటకంటె ఒక్క చేతితో నిత్యజీవము పొందుట మేలు. నీ కాలు నీకు పాపకారణమైనచో, దానిని నరికి పారవేయుము. రెండుకాళ్ళతో నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క కాలితో నిత్య జీవమున ప్రవేశించుట మేలు. నీ కనులు నీకుపాప కారణమైనచో దానిని పెరికి పారవేయుము. రెండుకన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుటకంటె ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరకలోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ప్రతి ఒక్కనికి ఉప్పదనము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కాని అది తన ఉప్పదనమును కోల్పోయిన, తిరిగి మీరు ఎట్లు దానిని సారవంతము చేయగలరు? కావున, మీరు ఉప్పదనమును కలిగి ఒకరితో ఒకరు సమాధానముతో ఉండుడు" అనెను.
క్రీస్తు సంబంధీకులు : ఈనాటి సువిశేషంలో యేసు ప్రభువు మిమ్ములను క్రీస్తు సంబంధీకులుగా గుర్తించి మీకు ఎవరు చెంబెడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును పొందును అని అంటున్నారు. ఎవరు ఈ క్రీస్తు సంబంధికులు అంటే సువిశేష భాగంలో యేసు ప్రభువుని అనుచరులు అని లేక శిష్యులు అని తెలుస్తుంది. ఇది కేవలం అప్పటి శిష్యులు లేక అనుచరులేనా అంటే కాదు ఎందుకంటే యేసు ప్రభువుకు చెందిన వారు ఎవరో మనము ఈ అధ్యాయములోనే చూస్తాము. అంతకు ముందు ప్రభువు పేరిట ఒకడు దయ్యములను వదలకొడుతున్నప్పుడు శిష్యులు వాడిని వారించిన పిదప ఆయనకు ఆ విషయం చెప్పగా ప్రభువు అతనిని తనకి చెందిన వానిగానే చెబుతున్నాడు. తరువాత కూడా మీరు వెళ్లి లోకమున ఉన్న వారిని నా అనుచరులుగా చేయమని ప్రభువు చెబుతున్నాడు. ఎవరు అయితె ప్రభువు మాట ప్రకారం జీవిస్తారో వారు క్రీస్తు అనుచరులు, వారే క్రీస్తు సంబంధీకులు. అందుకే ప్రభువు నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడె నా సోదరుడు సోదరి, తల్లి అని ప్రకటించారు. ఈరోజు మనం ఆయన సంబంధీకులము కావాలంటే ఆయన మాటలను అనుసరించాలి. ఈ విధంగా జీవించిన క్రీస్తు సంబంధీకులను గౌరవించిన వారికీ తగిన ప్రతిఫలం ఉంటుంది. ఎందుకంటే వారి ద్వారా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. ఇది వారి మాటల ద్వారా వారి ప్రేమ పూర్వక జీవితం ద్వారా జరుగుతుంది.
పాపము చేసిన వారు నరకానికి వెళుతారు, నరకములో ఒక వ్యక్తి చాలా ఘోరమైన బాధలకు గురవుతాడు. అది నిత్యము బాధలతో ఉండే స్థితి. నరకము అనేది దేవున్ని తిరస్కరించి, ఆయనకు వ్యతిరేకమైన పనులు చేస్తు పశ్చాత్తాప పడకుండా పాపములోనే మరణించేవారు పొందే స్థితి. నరకంలోఎల్లప్పుడు బాధ అనే స్థితి మాత్రమే ఉంటుంది. ఊరట కోసం ఎంత ప్రయత్నించిన అది అది వారికి అందదు. అందుకే ప్రభువు ఈ స్థితి మనకు రాకూడదు అని కోరుకుంటున్నారు. అందుకే మనిషిని నరకానికి పాత్రులుగా చేసే ఎటువంటి దానిని కూడా మన దగ్గర ఉండకూడదు అని కోరుకుంటున్నారు.
ప్రభువు మనలను ఇతరులు పాపము చేయుటకు కారణం కాకూడదు అని చెబుతున్నారు. అటుల అగుటకంటె మనము మరణించుటయే మంచిది అని పలుకుతున్నారు. మనము పాపము చేయుటకంటే మనము పాపము చేయుటకు మనలో ఏదైన కారణమైతే దానిని కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండమని ప్రభువు చెబుతున్నాడు. ప్రభువు ఎందుకు ఇలా చెబుతున్నాడు? ఎందుకంటే నిత్యం జీవం అనేది అత్యంత విలువైనది, ఏమి ఇచ్చిన కాని దానిని కొనలేము. మంచి జీవితం జీవించే వారికి దేవుడు ఇచ్చే బహుమతి ఇది. ఏ వ్యక్తి కూడా తన సొంత ప్రతిభ వలన సాధించదగినది కాదు. పాపము చేసిన వారు కూడా పశ్చాత్తాప పడి ప్రభువు ముందు క్షమాపణ అడిగితే వారికి కూడా ప్రభువు నిత్యజీవాన్ని అనుగ్రహిస్తాడు. అది ప్రభువును ముఖాముఖిగా దర్శించు భాగ్యం. ఎల్లప్పుడూ ఆనందముగా ఉండేటువంటి స్థితి. అందుకే మనలో పాపకారణమైన భాగం ఉంటె దానిని కోల్పోవడానికి అయిన సిద్దపడి నిత్యజీవం పొందుటకు సాధన చేయమని ప్రభువు చెబుతున్నాడు.
ప్రార్ధన: ప్రభువా! మీ అనుచరులు ఎల్లప్పుడు మీమ్ములను ఆదర్శంగా తీసుకోవాలని, మీ వలె జీవించాలని కోరుకుంటున్నారు. మీ అనుచరులను గౌరవించిన వారికి తగిన ప్రతిఫలమును పొందుతారు అని చెబుతున్నారు. మీ అనుచరులుగా మీకు సంబంధికులుగా ఉండుటవలన మిమ్ము ఇతరులకు మా జీవితాల ద్వారా చూపించు,వినిపించు అనుగ్రహం ప్రసాదిస్తున్నారు. దీనిని సద్వినియోగ పరచుకొని చెడుమార్గంలో ప్రయాణించకుండ, మీ మార్గములో ప్రయాణిస్తూ, మాలో ఏదైనా పాపకారణమైనది ఉన్నచో దానిని తీసివేసి, మీ వలె జీవిస్తూ, నిత్యజీవానికి వారసులము అయ్యేలా అనుగ్రహించండి. ఆమెన్.
16, ఫిబ్రవరి 2025, ఆదివారం
మార్కు 9:38-40
February 26
సిరా 4:11-19
మార్కు 9:38-40
అంతట యోహాను యేసుతో "బోధకుడా! మనలను అనుసరింపని ఒకడు నీపేరిట దయ్యములను పారద్రోలుట మేము చూచి వానిని నిషేధించితిమి" అని పలికెను. అందుకు యేసు "మీరు అతనిని నిషేధింపవలదు, ఏలయన, నా పేరిట అద్భుతములు చేయువాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధికానివాడు మన పక్షమున ఉండువాడు.
యోహాను యేసుతో, “బోధకుడా, దయ్యాలను వెళ్ళగొట్టే వ్యక్తిని మేము చూశాము. అతను మనల్ని అనుసరించడు కాబట్టి మేము అతన్ని ఆపడానికి ప్రయత్నించాము” అని చెప్పడంతో ప్రారంభమవుతుంది ఈనాటి సువిశేషం. ఆ వ్యక్తి దయ్యాలను వెళ్ళగొట్టే సామర్థ్యం పట్ల శిష్యులు అసూయపడుతున్నారా? వారు ఈ రకమైన శక్తిని కలిగి ఉండాలనుకుంటున్నారా? అనే ప్రశ్నలను అడిగితే ఆ వ్యక్తి వలే వీరుకూడా చేయాలి అని అనుకోని ఉండవచ్చు. యేసు యోహానుతో, “అతన్ని నిరోధించవద్దు. ఎవరైనా నా నామంలో మంచి పని చేస్తే, నా గురించి వారు ఎలా చెడుగా మాట్లాడరు” అని అంటాడు. తరువాత యేసు ఇలా అంటాడు: “మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షాన ఉన్నాడు.”
ఈ రోజు యేసు ప్రభువు మనకు ఒక ముఖ్యమైన సూచన ఇస్తున్నాడు. మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షాన ఉన్నాడని ఆయన మనకు చెబుతున్నాడు. సాధారణంగా చాలా మంది మానవులకు ఏ వ్యక్తులు తమను ఆదరిస్తారో తెలుసు. అయితే, ఏ వ్యక్తులు మనతో పోరాడవచ్చు, మనల్ని ఇష్టపడకపోవచ్చు లేదా మనల్ని విస్మరించవచ్చు అని కూడా మనకు తెలుసు. కాని ఈ రోజులలో మనతో మంచిగా మాటలాడి మనము లేని సమయంలో వ్యతిరేకంగా మాటలాడువారే ఎక్కువ మంది ఉండవచ్చు.
యేసు ప్రభువును అనుసరించకుండా, ఆయన నామమున ఒక వ్యక్తి దయ్యములను వెడలగొడుతున్నాడు అంటే ఆ వ్యక్తి యేసు ప్రభువును దేవునిగా , రక్షకునిగా అంగీకరించాడు. మరియు యేసు ప్రభువు మాటలను పాటించి జీవిస్తూ ఉండవచ్చు. ఎదో ఒక సమయంలో ప్రభువు మాటలను విని, ఆయన ఈ విధంగా చేస్తున్నాడు. ప్రభువు చెప్పినట్లు ఆ వ్యక్తి ప్రార్థన, మరియు ఉపవాసములతో జీవించేవాడు అయివుండవచ్చు ఎందుకంటే ప్రభువే చెబుతున్నాడు ఇటువంటివి కేవలం ప్రార్ధన మరియు ఉపవాసంతోనే సాధ్యమని కనుక ఆ వ్యక్తి ప్రభువుతో ఉండకపోయినా ప్రభువుని అనుచరుడే.
మానవులుగా, మనలో చాలామంది ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో దాని గురించి ఎక్కువగా శ్రద్ధ వహించవచ్చు. అయితే, యేసు తన శిష్యులు నిజంగా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నాడు. వారు ఇతరుల పట్ల అసూయపడటం లేదా మరొకరి సామర్థ్యాలు మరియు బహుమతులను కోరుకోవడం ఆయనకు ఇష్టం లేదు. తన శిష్యులు తమ సొంత బహుమతులను మరియు ఇతరుల బహుమతులను కూడా అభినందించాలని యేసు స్పష్టంగా కోరుకుంటున్నాడు.
Br. Pavan OCD
మార్కు 9:30-37
February 25
సిరా 2:1-11
మార్కు 9:30-37
వారు ఆ స్థలమును వీడి గలిలీయ ప్రాంతమునకు వెళ్లిరి. తాను ఎచ్చటనున్నది ఎవరికిని తెలియకూడదని ఆయన కోరిక. ఏలయన, "మనుష్యకుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును. వారు ఆయనను చంపుదురు కాని మరణించిన మూడవదినమున ఆయన పునరుత్తానుడగును" అని యేసు తన శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దీనిని గ్రహింపలేకపోయిరి. అయినను ఆయనను అడుగుటకు భయపడిరి. అంతట వారు కఫర్నామునాకు వచ్చిరి. అందొక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను "మార్గమధ్యమున మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుంటిరి?" అని అడిగెను. తమలో గొప్పవాడెవ్వడని మార్గమధ్యమున వాదించు కొనియుండుటచే వారు ప్రత్యుత్తరమీయలేక ఊరకుండిరి. అప్పుడు యేసు కూర్చుండి పన్నిద్దరు శిష్యులను చేరబిలిచి, "ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై, అందరకు సేవకుడుగా ఉండవలయును"అని పలికెను. మరియు ఆయన ఒక చిన్నబిడ్డను చేరదీసి వారి మధ్యనుంచి, వానిని ఎత్తి కౌగలించుకొని శిష్యులతో, "ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట స్వీకరించువాడు నన్ను స్వీకరించినవాడగును. నన్ను స్వీకరించినవాడు నన్నుకాదు , నన్ను పంపినవానిని స్వీకరించుచున్నాడు" అనెను.
యేసు ప్రభువు , పన్నెండు మందిని పిలిచి, మీలో ఎవరైనా మొదటివారిగా ఉండాలనుకుంటే, అతను చివరివాడిగా మరియు అందరికీ సేవకుడిగా ఉండాలని చెబుతున్నాడు. అంతకు ముందు యేసు ప్రభువు తనకి అత్యంత సన్నిహిత శిష్యులను, తీసుకొని ఒక రహస్య ప్రదేశానికి ప్రార్ధించుటకు వెళ్ళాడు, తరువాత వారు కఫర్నముకు వచ్చారు, యేసు ప్రభువు వారిని దారిలో దేని గురించి వాదిస్తున్నారని అడిగాడు. ఎవరు గొప్పవారో వారు వాదించుకుంటున్నారని వారు అంగీకరించడానికి ఇష్టపడలేదు. అది ప్రభువుకు వారు చెప్పలేక పోయారు.
మొదటివారిగా ఉండాలనుకునే ఎవరైనా చివరివారై ఉండాలి, అందరికీ సేవకుడుగా కావాలని ప్రభువు చెప్పాడు. కేవలం అది చెప్పడంతో ఆగిపోకుండా ఒక చిన్న బిడ్డను తీసుకొని , వారి మధ్య ఉంచి తన పేరు మీద ఒక బిడ్డను స్వాగతించేవాడు తనను స్వాగతిస్తాడని చెబుతున్నాడు. చిన్నవాడిని లేక ఇతరుల మీద ఆధారపడేవారిని ఆహ్వానించడం మనలను దైవ స్వభావం కలిగేలా చేస్తుంది. ప్రపంచం తరచుగా నాయకత్వాన్ని, అధికారంతో, శక్తితో సమానం చేస్తుంది.
దేవుని రాజ్యంలో, అధికార సమీకరణం తారుమారు అవుతుంది. మనం సేవ చేయడం ద్వారా నాయకత్వం వహిస్తాము, దిగువకు మారడం ద్వారా ఉన్నతంగా వెళ్తాము, అత్యల్పంగా ఉండటం ద్వారా అధికారాన్ని ఉపయోగిస్తాము. స్వార్థపూరిత నాయకత్వానికి అలవాటుపడిన ప్రపంచంలో ఇది అర్ధవంతం కాదు. దేవుడిని ప్రేమించడం మరియు ఒకరినొకరు ప్రేమించుకోవడం అనే రెండు గొప్ప ఆజ్ఞలు ఉన్న సమాజ మాత్రమే లో, లోక నియమాలను తిప్పికొట్టకలుగుతుంది. .
మనం ఇతరులకు సేవ చేసినప్పుడు నాయకత్వం వస్తుంది. ప్రజలకు సహాయం చేయడంలో ప్రభావం వస్తుంది. అది మనం కోరుకునేది కాదు, ఎందుకంటే మనం కోరుకునేది సేవ చేయడమే. సేవ చేయడంలో అవకాశం నాయకత్వం వహించడానికి రావచ్చు.
Br. Pavan OCD
మార్కు 9:14-29
February 24
సిరా 1:1-10
మార్కు 9:14-29
వారు తక్కిన శిష్యులను చేరుకొని అచ్చట పెద్ద జనసమూహము కూడియుండుట చూచిరి. ధర్మ శాస్త్ర బోధకులు క్కో శిష్యులతో తర్కించుచుండిరి. యేసును చూడగనే ప్రజలు ముగ్గుల ఆశ్చర్యపడి, పరుగునవచ్చి ఆయనకు నమస్కరించిరి. "వారితో ఏ విషయమునుగూర్చి తర్కించుచున్నారు?" అని యేసు శిష్యులను ప్రశ్నించెను. జనసమూహములో ఒకడు "బోధకుడా!మూగ దయ్యము పట్టిన నా కుమారుని తమయొద్దకు తీసుకొనివచ్చితిని. భూతము వీనిని ఆవేశించినపుడెల్ల నేలపై పడవేయును. అప్పుడు వీడు నోటి వెంట నురుగులు క్రక్కుచు పండ్లు కోరుకుచు, కొయ్యబారిపోవును. ఈ దయ్యమును పారద్రోలమీ శిష్యులను కోరితిని. అది వారికి సాధ్యపడలేదు" అని విన్నవించెను. యేసు వారితో "మీరు ఎంత అవిశ్వాసులు! నేను ఎంత కాలము మీ మధ్యనుందును? ఎంతవరకు మిమ్ము సహింతును? ఆ బాలుని ఇటకు తీసుకొని రండు" అనగా, వారు అట్లే వానిని తీసికొని వచ్చిరి. యేసును చూచినవెంటనే ఆ దయ్యము వానిని విలవిలలాడించి నేలపై పడవేసి, అటుఇటు దొర్లించి, నురుగులు క్రక్కించెను. "ఈ దుర్బరావస్థ ఎంత కాలము నుండి?" అని యేసు ఆ బాలుని తండ్రిని అడిగెను. "పసితననము నుండి" అని అతడు బదులు చెప్పి, "అనేక పర్యాయములు ఆ భూతము వీనిని నాశనము చేయవలెనని నీళ్లలోను, నిప్పులలోను పడవేయుచున్నది. తమకిది సాధ్యమగునేని మాపై కరుణించి సాయముచేయుడు" అని ప్రార్ధించెను. అందుకు యేసు "సాధ్యమగునేని' అనుచున్నావా! విస్వసించు వానికి అంతయు సాధ్యమే" అని పలికెను. అప్పుడు ఆ బాలుని తండ్రి "నేను నమ్ముచున్నాను. నాకు అవిశ్వాసము లేకుండునట్లు తోడ్పడుము" అని ఎలుగెత్తి పలికెను. అంతట జనులు గుమికూడి తనయొద్దకు పరుగెత్తుకొనివచ్చుట చూచి యేసు "మూగ చెవిటి దయ్యమా! ఈ బాలుని విడిచిపొమ్ము, మరెన్నడును వీనిని ఆవహింపకుము" అని శాసించెను. అప్పడు ఆ భూతము ఆర్భటించుచు, బాలుని విలవిలలాడించి వెళ్లిపోయెను. బాలుడు పీనుగువలె పడిపోయెను. అనేకులు వాడు చనిపోయెననిరి. కాని, యేసు వాని చేతినిపట్టి లేవనెత్తగా వాడులేచి నిలుచుండెను. యేసు ఇంటికి వెళ్లిన పిదప శిష్యులు ఏకాంతముగ ఆయనతో "ఈ దయ్యమును పారద్రోల మాకు ఏల సాధ్యపడలేదు?" అని ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, "ప్రార్ధనవలనతప్ప మరే విధమునను ఇట్టి దయ్యములను పారద్రోల సాధ్యపడదు" అని చెప్పెను.
శిష్యులు మూర్ఛరోగిని ‘ స్వస్థపరచలేక’ దుష్టాత్మను వెళ్లగొట్టలేకపోవుటను చూసినప్పుడు, వారు తమ వైఫల్యానికి కారణాన్ని గురువును అడిగారు. ఆయన వారికి ‘సాతానుపై శక్తి మరియు అధికారం, మరియు అన్ని వ్యాధులను నయం చేయడానికి శక్తిని ’ ఇచ్చాడు. వారు తరచుగా ఆ శక్తిని ఉపయోగించారు మరియు వారికి సాతాను ఎలా లోబడి ఉన్నాడో సంతోషంగా చెప్పారు. అయినప్పటికీ, ఆయన కొండపై ఉన్నప్పుడు, వారు పూర్తిగా విఫలమయ్యారు.
దేవుని చిత్తం లేకుండా విముక్తి ప్రసాదించడం, అయన అనుగ్రహం లేకుండా ఏదైనా సాధించడం సాధ్యం కాదు. క్రీస్తు ఆజ్ఞ మేరకు దుష్టాత్మ వెళ్ళిపోయింది. మేమెందుకు చేయలేకపోయాము?’ అనే వారిప్రశ్న, వారు కూడా ఆ దుష్టాత్మను వెళ్ళగకొట్టాలని ప్రయత్నించారని స్పష్టంగా తెలుస్తుంది; వారి ప్రయత్నాలు ఫలించలేదు , ప్రజల ముందు వారి అశక్తి నిరూపితమైంది. దానికి వారు సిగ్గుపడ్డారు.
విశ్వాసం ఆధ్యాత్మిక జీవితంలో అత్యున్నత వ్యాయామం, ఇక్కడ మన ఆత్మ దేవుని ఆత్మకు పరిపూర్ణంగా స్వీకరించడంలో తనను తాను సమర్పించుకుంటుంది మరియు అత్యున్నత కార్యాచరణకు బలపడుతుంది. ఈ విశ్వాసం పూర్తిగా ఆధ్యాత్మిక స్థితిపై ఆధారపడి ఉంటుంది; ఇది బలంగా మరియు పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మన జీవితంలో పూర్తిగా ఆధిపత్యం చెలాయించినప్పుడు మాత్రమే, దాని శక్తివంతమైన పనులను చేయడానికి విశ్వాసమునకు శక్తి ఉంటుంది.
అందుకే యేసుప్రభువు సాతాను ఉపవాసం మరియు ప్రార్థన ద్వారా మాత్రమే పారద్రోలబడుతుంది. ఈ దుష్టాత్మలో ఉన్న మొండి పట్టుదలను , ప్రతిఘటనను అధిగమించగల విశ్వాసం, దేవునితో సన్నిహిత సహవాసంలో ఉండి మరియు లోకం దాని క్రియల నుండి సాధించవచ్చు. విశ్వాసం పెరగడానికి మరియు బలంగా ఉండటానికి ప్రార్థన జీవితం అవసరం. ప్రార్థన ఉపవాసం విశ్వాసాన్ని పెంచుతాయి.
విశ్వాసం పెరుగుదల కోసం ప్రార్థన జీవితం అవసరం. ఆధ్యాత్మిక జీవితంలోని అన్ని విభిన్న భాగాలలో, దేవునితో ఎంత దగ్గర సంబంధం కలిగి ఉంటామో అంత పవిత్రత కలిగి ఉంటాము. భగవంతుడిని ఆరాధించడంలో, ఆయన కోసం వేచి ఉండటంలో, దేవుడు తనను తాను మనకు వెల్లడించడానికి సిద్ధపడేది మన విశ్వాసం ప్రకారముగానే తెలుసుకుంటాము. దాని దేవుడిని తెలుసుకునే మరియు విశ్వసించే సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది.
Br. Pavan OCD
తపస్సు కాలపు నాలుగోవ ఆదివారం
తపస్సు కాలపు నాలుగోవ ఆదివారం యెహోషువా 5:9-12 2 కొరింథి 5: 17-21 లూకా 15: 1-3, 11-32 క్రీస్తునాధునియందు ప్రియ విశ్వాసిని వ...